: 4జీ ఫోన్ ఇవ్వలేదని నడిరోడ్డుపై బాయ్ ఫ్రెండ్ ని ఉతికి ఆరేసిన యువతి!
తాను కోరిన 4జీ ఫోన్ ను బహుమతిగా ఇవ్వలేదని ఆరోపిస్తూ, నడిరోడ్డని, నలుగురూ చూస్తున్నారని కూడా ఆలోచించకుండా బాయ్ ఫ్రెండ్ ని ఉతికి ఆరేసిందో యువతి. ఈ ఘటన ఆగ్రాలో జరుగగా, చుట్టూ ఉన్నవారు చోద్యం చూశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ యువతికి పాత ఫోన్ ఉంది. తన బాయ్ ఫ్రెండ్ కు నైనిటాల్ లో ఉద్యోగం రావడంతో, ఓ కొత్త 4జీ ఫోన్ బహుమతిగా ఇవ్వాలని కోరింది. నైనిటాల్ వెళ్లాక పంపుతానని యువకుడు చెప్పిన మీదట వాగ్వాదం జరిగింది. వెంటనే ఫోన్ కావాలంటూ, అతడి చెంపలు వాయిస్తూ, రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నుతూ నానాయాగీ చేసింది. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇస్తే, వారు వచ్చి ఇరువురి తల్లిదండ్రులనూ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.