: ఇటలీలో భూకంప విలయం!... 120కి పెరిగిన మృతుల సంఖ్య!
నిన్న చోటుచేసుకున్న భూకంపం ఇటలీని అతలాకుతలం చేసింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో కూడిన భూకంపం ధాటికి నిన్న ఇటలీలోని పలు పట్టణాలు నేలమట్టమయ్యాయి. ప్రధానంగా అమట్రీస్ నగరం ఈ భూకంపం ధాటికి పూర్తిగా దెబ్బతింది. నగరంలోని భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 120కి చేరింది. ఇంకా జాడ తెలియని వారి సంఖ్య వందల్లోనే ఉందట. వెరసి మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. భూకంప ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఆ దేశ ప్రధాని మట్టియో రెంజీ... పెను భూకంపం ఏ ఒక్కరిని వదలలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు ఆయన ప్రకటించారు.