: మన దేశంలో విడాకులు తీసుకునే వారిలో ముస్లింల సంఖ్యే ఎక్కువట!


హిందువులతో పోలిస్తే ముస్లిం మతస్తుల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉందట. 2011 జనాభా లెక్కల నుంచి సేకరించిన తాజా సమాచారం ప్రకారం ఈ విషయం వెల్లడైంది. పలు మతాలలో భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం, వేరుపడటం వంటి పలు విషయాలు దీని ద్వారా తెలిశాయి. మిగిలిన అన్ని మతాలవారితో పోలిస్తే హిందూమతంలో విడాకులు తీసుకునే వారి శాతం తక్కువగా ఉంది. వెయ్యిమంది హిందువులలో డైవోర్స్ రేట్ 1.8 శాతంగా ఉంది. అదే ముస్లింల విషయానికొస్తే, వెయ్యిమందిలో డైవోర్స్ రేట్ 3.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. నిపుణులు చెప్పిన దాని ప్రకారం, వెయ్యిమంది ముస్లిం మహిళల్లో ఐదుగురు విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. అదే, హిందూ, సిక్కు, జైన్ మతాలకు చెందిన మహిళల్లో అయితే ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారు. విడాకులు తీసుకున్న, వేర్వేరుగా జీవిస్తున్న వారిలో క్రిస్టియన్లు, బౌద్ధమతానికి చెందిన వారు భారత్ లో ఎక్కువగా ఉండగా; జైన్లు, సిక్కు మతస్తుల్లో ఆ సంఖ్య తక్కువగా ఉన్నట్లు 2011 జనాభా లెక్కల నుంచి సేకరించిన తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News