: ‘ఎయిర్ అరేబియా’లో ప్రయాణించే భారతీయులకు 'ఈఎంఐ' ఆఫర్


షార్జా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ అరేబియా ఎయిర్ లైన్స్ భారత ప్రయాణికులకు ఒక మంచి సదుపాయం కల్పించింది. తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించే భారత ప్రయాణికులు నెలవారి వాయిదా పద్ధతుల్లో (ఈఎంఐ) టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్ బీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ సహా ఎంపిక చేసిన 8 బ్యాంకుల క్రెడిట్ కార్డులున్న వారికి ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపారు. సదరు ప్రయాణికుడు కొనుగోలు చేసిన టికెట్ల డబ్బులను ఎన్ని నెలల్లో చెల్లించాలో ముందు నిర్ణయించుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News