: మానసిక ఆరోగ్యానికి దేవుడే గొప్ప డాక్టరు
డిప్రెషన్‌లో పడిపోయిన వారిని బయటకు తీసుకురావడం ఎలా? సైకియాట్రిస్టులకు ఇందుకోసం రకరకాల మార్గాలుంటాయి. అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ డేవిడ్ హోచ్ రోజ్మెరిన్ ప్రకారం.. వీరికి స్వస్థత చేకూర్చడంలో దేవుడిని మించిన డాక్టరు లేడు. మతంతో నిమిత్తం లేకుండా.. దేవుడి పట్ల విశ్వాసం ఉండే వారిలోనే డిప్రెషన్ నుంచి బయటపడడానికి అందించే చికిత్స సత్ఫలితాలు ఇస్తోందని ఆయన సెలవిస్తున్నారు.
మానసిక రోగిలో దైవభక్తి, చికిత్స ఫలితాల గురించి ఆయన ఏడాదిపాటు 159 మంది మీద పరిశోధన చేశారు. దేవునిపై నమ్మకం ఉన్నవారు అంతేస్థాయిలో చికిత్సను కూడా నమ్మారు. ఫలితంగా వీరి మీద సత్ఫలితం కనిపించింది. అయితే.. దేవుడే వీరిని రక్షిస్తున్నాడని తాను చెప్పలేనని, సహజంగా భక్తి అందించే మానసిక సత్ప్రవర్తన.. మనలోని హింసాప్రవృత్తిని అదుపులో పెట్టడం వలన ఇలా జరగచ్చని రోజ్మెరిన్ అంటున్నారు.