: డ్ర‌మ్స్ వాయించ‌డంలో అమెరికా యువ‌తి రికార్డును అధిగ‌మించిన ఇండోర్ యువ‌తి... ఏకధాటిగా 31 గంటల ప్రదర్శన


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ కు చెందిన శ్రిష్టి ప‌టిడార్(24) అనే యువతి డ్ర‌మ్స్ వాయించ‌డంలో ప్ర‌పంచ రికార్డు నెలకొల్పింది. అమెరికా యువ‌తి సోఫియా పేరు మీద‌ ఇపప్తివరకు వున్న రికార్డును ఆమె అధిగ‌మించింది. శ్రిష్టి ఏక‌ధాటిగా 31 గంట‌లు డ్ర‌మ్స్ వాయించింది. దీంతో గ‌తంలో ఏక‌ధాటిగా 24 గంట‌లు డ్ర‌మ్స్ వాయించి చ‌రిత్ర‌ సృష్టించిన‌ సోఫియా రికార్డును బద్దలుకొట్టి, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను మొద‌లుపెట్టిన శ్రిష్టి నిన్న రాత్రి 8 గంట‌ల‌వ‌ర‌కు కొన‌సాగించింది. శ్రిష్టి ఎంతో ప‌ట్టుద‌ల‌తో త‌న సాధ‌న‌ను చేసేదని ఆమె తండ్రి వినోద్ ప‌టిడార్ అన్నారు.

  • Loading...

More Telugu News