: ఉల్లాసంగా... ఉత్సాహంగా... పీవీ సింధు!
రియో ఒలింపిక్స్ లో సత్తా చాటి భారత్ కు రజత పతకాన్ని సాధించి పెట్టిన స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ప్రస్తుతం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతోందిట. మొన్న రియో నుంచి హైదరాబాదు చేరిన సింధును తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆ తర్వాత నిన్న విజయవాడ వెళ్లిన ఆమెను ఏపీ ప్రభుత్వం కూడా ఘనంగా సన్మానించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సింధుకు ఏకంగా రూ.8 కోట్ల మేర నజరానా అందింది. ఈ క్రమంలో హైదరాబాదులోని తన సొంతిల్లు చేరిన సింధు తనకిష్టమైన ఆహారం తీసుకుంటూ... తన ప్రతిభను కీర్తిస్తూ ప్రముఖులు చేస్తున్న ట్వీట్లకు రీ ట్వీట్లు చేస్తూ ఉత్సాహంగా గడుపుతోందట. రియోలో తీవ్ర ఒత్తిడితో గడిపిన సింధు... ఆ క్రీడా సంరంభం ముగిసిన నేపథ్యంలో కాస్తంత విశ్రాంతి తీసుకుని నూతనోత్తేజాన్ని నింపుకుంటోంది.