: శిశుమార్పిడి జరిగిందంటూ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ముందు ఆందోళన
ఎన్నో వివాదాలు చోటుచేసుకుంటోన్న హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మరో వివాదం రాజుకుంది. నిన్న ఆసుపత్రిలో తనకు మగ శిశువు పుడితే ఆడ శిశువును ఇచ్చారని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఆమె తరఫు బంధువులు ఈరోజు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో శిశుమార్పిడి చేశారని, సిబ్బంది డబ్బులకు ఆశపడి ఇటువంటి చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిశువులకి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని, తమ మగ శిశువును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన వల్ల ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.