: బీజేపీని దళిత వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు: మోదీ ఆవేదన


ఓవైపు తాను, తన ప్రభుత్వం దళితులకు అండగా నిలబడుతుంటే, ఇంకోవైపు కావాలనే కొందరు బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ హాల్‌లో మంగళవారం జరిగిన బీజేపీ నేషనల్ కోర్ గ్రూప్ సమావేశంలో మాట్లాడిన ప్రధాని బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ కేడర్‌లో అణగారిన వర్గాల వారే అధికమని పేర్కొన్న మోదీ 80 శాతానికి పైగా బీజేపీ కార్యకర్తలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందినవారేనని పేర్కొన్నారు. అయినా పార్టీపై ఆయా వర్గాల్లో దురభిప్రాయం కలిగించేందుకు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు.

  • Loading...

More Telugu News