: మరోమారు కశ్మీర్‌కు రాజ్‌నాథ్.. నేడు, రేపు అక్కడే!


రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు శ్రీనగర్ వెళ్లనున్నారు. జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై పలువురు ప్రతినిధులతో రెండో దఫా చర్చలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. రాజ్‌నాథ్ కశ్మీర్ వెళ్లడం నెలలో ఇది రెండోసారి. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, గవర్నర్ ఎన్ఎన్ ఓరా, రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు, భద్రతా దళాలు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, పౌర సమాజ ప్రతినిధులు, కశ్మీరీ పండిట్లు, స్కూలు యాజమాన్యాలతో చర్చలు జరుపుతారు. హోంమంత్రి గత పర్యటన సందర్భంగా తాను జమ్ముకశ్మీర్‌ను తరచూ సందర్శిస్తుంటానని చెప్పిన విషయం తెలిసిందే. కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై పలువురితో చర్చలు జరపనున్న రాజ్‌నాథ్ హురియత్ నేతలను మాత్రం కలుసుకునేందుకు ఇష్టం చూపడం లేదు.

  • Loading...

More Telugu News