: విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం... నిబంధనలు సడలించే యోచనలో ఐఐటీలు


ఐఐటీల్లో విద్య నభ్యసిస్తున్న విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్న కారణంగా నిబంధనలు సడలించే యోచనలో ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ దేశంలోని ఐఐటీల డైరెక్టర్లు, చైర్ పర్సన్ లతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ విషయమై ఆయన వారితో చర్చించి, ఐఐటీల్లో నిబంధనల సడలింపు గురించి నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీల్లో 5 వారాల పాటు ఒక కార్యక్రమం నిర్వహించి, విద్యార్థుల నుంచి సలహాలను తీసుకోనున్నారు. విద్యార్థులు తమ ఇంట్లో నుంచే వీడియో ద్వారా తరగతులను వీక్షించే అవకాశం ఇకపై కల్పించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా వచ్చే మూడేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నామని జవదేకర్ పేర్కొన్నారు. విద్యా సంస్థలకు నిధుల నిమిత్తం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా, ఐఐటీల వసతి గృహాలకు సంబంధించి కూడా నిబంధనలు సడలిస్తున్నట్లు జవదేకర్ తెలిపారు.

  • Loading...

More Telugu News