: సింధు ఎంత స్పీడ్ గా ఆడిందో, అంత స్పీడ్ గా చెప్పండి: చంద్రబాబు


కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రసంగం అనంతరం రాష్ట్రాభివృద్ధి కోసం అక్కడ హాజరైన వారితో సంకల్పం చేయించారు. ఈ సందర్భంగా సంకల్పంలోని అంశాలను చంద్రబాబు చదువుతుండగా అక్కడ హాజరైన వారు ఆయనను అనుసరించారు. అయితే, చాలా మెల్లగా వారు సంకల్పం చెప్పడాన్ని గమనించిన చంద్రబాబు ‘సింధు ఎంత స్పీడ్ గా ఆడిందో, అంత స్పీడ్ గా మీరూ చెప్పాలి’ అంటూ వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News