: చంద్రబాబు తయారు చేసిన వజ్రం పి.వి సింధు: అచ్చెన్నాయుడు
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి. సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ లకు ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా సన్మానం జరుగుతోంది. ఈ సందర్భంగా వేదికపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు స్వాగతోపన్యాసం చేశారు. 'ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వారు గర్వించిన రోజు సింధు పతకం సాధించిన రోజు' అని ఆయన అన్నారు. ఇంత పెద్ద దేశంలో ఒక పతకం కూడా రావట్లేదన్న బాధ మనలో ఉండేదని సింధు పతకం తీసుకొచ్చిందని ఆయన అన్నారు. తెలుగు వారికి సింధు ఎంతో గర్వకారణంగా నిలిచిందని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచంలో తెలుగు వారికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే దానికి కారణం చంద్రబాబేనని ఆయన అన్నారు. ఆయన విజన్ ఎంతో గొప్పదని ఆయన అన్నారు. చంద్రబాబు తయారు చేసిన వజ్రం పి.వి. సింధు అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆనాడు ఎంతో విజన్ తో గోపిచంద్ ఆకాడమీ పెట్టడానికి చంద్రబాబు కారణమయ్యారని ఆయన అన్నారు. ఈరోజు దానిలో శిక్షణలో తీసుకున్న సింధు దేశానికి పతకం తీసుకొచ్చిందని పేర్కొన్నారు.