: కరీంనగర్‌ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు


ప్రభుత్వాధికారుల తీరుని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా రాయ్‌కల్ మండలంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అల్లీపూర్‌లో విద్యుత్‌ అధికారులు ఆటోమెటిక్‌ స్టార్టర్లు తొలగిస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు త‌మ చ‌ర్య‌ల‌ను వెంట‌నే ఆపేయాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళ‌న‌లో భాగంగా ప్రధాన రహదారిపైకి చేరుకుని అక్క‌డే బైఠాయించారు. దీంతో ర‌హ‌దారిపై వాహన‌రాక‌పోక‌ల‌కు స్వ‌ల్పంగా అంతరాయం ఏర్పడింది. అక్క‌డికి చేరుకున్న పోలీసులు ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News