: ఎన్ని జన్మలెత్తినా అభిమానులకు రుణపడే ఉంటాం: హీరో రాంచరణ్ తేజ్
ఎన్ని జన్మలెత్తినా అభిమానులకు రుణపడే ఉంటామని హీరో రాంచరణ్ తేజ్ అన్నాడు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న రాంచరణ్ మాట్లాడుతూ, ‘అభిమానులను చూస్తుంటే చిరంజీవి కుటుంబసభ్యులు మేమా? మీరా? అనిపిస్తుంటుంది. మా నాన్నపై మేము చూపించే ప్రేమకు మించి అభిమానులు చూపిస్తుంటారు. అభిమానుల నుంచి మేము నేర్చుకుంటూనే ఉంటాము. సినిమాలు ఒకసారి హిట్ అవొచ్చు, ప్లాప్ అవొచ్చు. కానీ, మీ అభిమానం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అభిమానులను మేమెప్పుడూ కేర్లెస్ గా చూడలేదు’ అని రాంచరణ్ అన్నారు. అనంతరం ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.