: 15 మందికి అర్జున అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ముగ్గురికి ధ్యాన్ చంద్ పురస్కారం
కేంద్ర ప్రభుత్వం ఈరోజు 15 మందికి అర్జున అవార్డులు(2016) ప్రకటించింది. రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్), శివథాపా (బాక్సింగ్), అజింక్యా రహానే (క్రికెట్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి (హాకీ), వీఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్‌సింగ్ (షూటింగ్), అపూర్వి చందేలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్‌కుమార్ (రెజ్లింగ్), సందీప్‌సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేంద్ర సింగ్ (రెజ్లింగ్-బధిర)కు అర్జున అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ముగ్గురికి ధ్యాన్‌చంద్ అవార్డు(2015)లను అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. సత్తి గీత (అథ్లెటిక్స్), సివ్లానస్ ధంగ్ ధంగ్(హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షెల్కె (రోయింగ్)లకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపింది.