: ఆవుల కొమ్ములకు చెల్లుచీటీ!
ముందొచ్చిన చెవుల కంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి అని సామెత. అయితే అసలు కొమ్ములే రాకపోతే ఎలా ఉంటుంది. కొమ్ముల్లేని ఆవును ఊహించుకోవాలంటే.. ఒక పట్టాన కుదరడం లేదా? కొంత కాలం ఆగితే చాలు.. బ్రిటన్ శాస్త్రవేత్తల ప్రయోగాలు పూర్తయ్యాయంటే.. ఊహించాల్సిన అవసరం లేకుండా.. కొమ్ముల్లేని ఆవులు మీ కళ్ల ముందుకు వచ్చేస్తాయి. పాడిపరిశ్రమ గణనీయంగా ఉండే బ్రిటన్‌లో ఆవులు తమ కొమ్ములతో పొడవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్న రైతుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దీంతో శాస్త్రవేత్తలు జన్యుమార్పుల ద్వారా అసలు కొమ్ములే లేకుండా ఆవులను సృష్టించే పనిలో పడ్డారు.
ఆవుకు కొమ్ముల్లేకపోతే ప్రమాదాలు తగ్గుతాయని వీరి లెక్క. ఆవు కొమ్ములతో కుమ్మడం వలన ప్రమాదాలు గాయపడుతున్న వారి సంఖ్య ఏటా వందల్లో ఉంటోంది. అయితే ఈ ప్రయోగాలు చేస్తున్న ఎడిన్‌బర్గ్ రోస్‌లిన్ ఇన్స్‌టిట్యూట్ వారు గతంలో వ్యాధులను తట్టుకోగలిగే జన్యుమార్పిడి పందుల సృష్టికి కూడా ప్రయత్నించారు.