: జావెలిన్ చేతబట్టిన జమైకా చిరుత!... 56 మీటర్ల దూరం విసిరి అబ్బురపరచిన బోల్ట్!


పరుగులో జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కు సాటిరాగల అథ్లెట్ సమీప భవిష్యత్తులో కనిపించే అవకాశాలు లేవు. గడచిన 12 ఏళ్లుగా అతడు ట్రాక్ పై పెట్టిన పరుగుల రికార్డులే ఇందుకు నిదర్శనం. రియో ఒలింపిక్స్ సహా అంతకుముందు జరిగిన రెండు ఒలింపిక్స్ లలోనూ 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలన్నీ బోల్ట్ ఖాతాలోనే పడ్డాయి. వెరసి ఒలింపిక్స్ చరిత్రలో ట్రిపుల్ ట్రిపుల్ సాధించిన అథ్లెట్ గా అతడు చరిత్ర సృష్టించాడు. మొన్న రియోలో తనదైన ప్రతిభ కనబరచిన బోల్డ్ ఇక పరుగుల పోరుకు స్వస్తి పలికాడు. రన్నింగ్ కు వీడ్కోలు పలికిన తర్వాత... సాంతం పరుగులు పెట్టిన అతడికి ఆ పందెం బోర్ కొట్టిందేమో తెలియదు కాని... రియోలో అతడు జావెలిన్ చేతబట్టాడు. జావెలిన్ ను చేతితో పట్టుకుని అల్లంత దూరం వెనక్కు వెళ్లిన బోల్ట్... రెట్టించిన ఉత్సాహంతో పరుగు పెట్టి అచ్చం జావెలిన్ త్రో క్రీడాకారుడికి మల్లే దానిని గాల్లోకి విసిరాడు. అది 56 మీటర్ల దూరంలో పడింది. జావెలిన్ త్రోలో ఏమాత్రం అనుభవం లేని బోల్డ్ అంతదూరం దానిని విసిరివేయడం అక్కడి వారిని ఆకట్టుకుంది. బోల్డ్ జావెలిన్ త్రోకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అంతర్జాతీయ, జాతీయ మీడియాలోకి వచ్చి చేరింది.

  • Loading...

More Telugu News