: బ్రిటిష్ సంప్రదాయానికి చెల్లుచీటి!... జనవరిలోనే పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్!


నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ‘పాత చింతకాయ పచ్చడి’ లాంటి బ్రిటిష్ సంప్రదాయాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. బ్రిటిష్ పాలన నుంచి సంక్రమించిన రైల్వే బడ్జెట్ కు ఇప్పటికే గుడ్ బై చెప్పిన ఎన్డీఏ సర్కారు... రానున్న కేంద్ర బడ్జెట్ (2017-18) ను జనవరిలోనే పార్లమెంటు ముందుకు తేనుంది. బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి ఆఖరులోగానే పార్లమెంటు ముందుకు వచ్చేది. తాజాగా దానిని జనవరిలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కారు దాదాపుగా నిర్ణయం తీసుకుంది. జనవరిలోనే కొత్త బడ్జెట్ పై ఓ అంచనా తెలిస్తే... అప్పటిదాకా మిగిలిపోయిన నిధులను ఆయా శాఖలు త్వరితగతిన ఖర్చు చేసే అవకాశం లభిస్తుందన్న భావనతోనే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News