: పుష్కరాలకు రావాలంటూ సింధుకు చంద్రబాబు ఆహ్వానం
రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ విజేత పివి సింధుకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ నెల 23న కృష్ణా పుష్కరాలు, హారతి కార్యక్రమం తిలకించేందుకు రావాలంటూ ఈ సందర్భంగా సింధుకు ఆయన ఆహ్వానం పలికారు. పుష్కర ఆహ్వానానికి సింధు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. హైదరాబాద్ కు రేపు చేరుకోనున్న సింధును ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని స్వయంగా కలిసి ఆమెకు పుష్కర ఆహ్వానం అందజేస్తారు.