: పీవీ సింధుకు ఫిక్కీ లైఫ్ టైమ్ మెంబర్ షిప్


రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన ప్రముఖ షట్లర్ పీవీ సింధుకు మరో గౌరవం దక్కింది. ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా విభాగం హైదరాబాద్ చాప్టర్ సింధుకు లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ను ప్రకటించింది. హైదరాబాద్ చాప్టర్ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో చైర్ పర్సన్ పద్మ విలేకరులతో మాట్లాడుతూ, బ్యాడ్మింటన్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన సింధుకు జీవితకాల సభ్యత్వం అందజేశామన్నారు. ఈ సందర్భంగా సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ కు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News