: రోజాది అగ్రకుల అహంకారం: పీతల సుజాత


వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై ఏపీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,‘రోజాకు అగ్రకుల అహంకారమెక్కువ. రోజా వ్యవహారశైలి, భాష, రెచ్చగొట్టే విధానాన్నే మేం తప్పుబడుతున్నాము. నేను కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటాను. నేను మంత్రి అయిన మొదటి సంవత్సరం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇప్పుడు మాత్రం అంతా సర్దుకుంది. దళిత మహిళా మంత్రి అనే వివక్ష కొంత ఉంటుంది. వడ్డాణం బహుమతి, పది లక్షల సంచి... వంటి వ్యవహారాలు నాపై ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారాలే. ఈ ఆరోపణలతో నాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. నా ఏకాగ్రత అంతా రాష్ట్రాభివృద్ది పైనే ఉంది’ అని పీతల సుజాత పేర్కొంది.

  • Loading...

More Telugu News