: కామెడీ స్టార్ సునీల్ పుష్కరస్నానం
మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుష్కర ఘాట్ లో కామెడీ హీరో సునీల్ పుష్కర స్నానమాచరించాడు. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం చేశాడు. అక్కడి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సునీల్ మీడియాతో మాట్లాడుతూ, పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని, సామాన్యులు, వీఐపీలు అందరూ ఎంతో సంతోషంగా పుష్కరస్నానాలు చేస్తున్నారని అన్నాడు.