: శ్రీవారికి రూ. కోటి విరాళమిచ్చిన హెచ్ సీఎల్ అధినేత శివనాడార్
టెక్నాలజీ దిగ్గజం హెచ్ సీఎల్ అధినేత శివనాడార్, తిరుమల శ్రీవారికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో శివనాడార్ స్వామివారిని దర్శించుకోగా, ఆలయ ఈవో సాంబశివరావు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారి సేవలకు తన విరాళాన్ని వినియోగించాలని పేర్కొన్న ఆయన, అందుకు సంబంధించిన బ్యాంక్ చెక్కును సాంబశివరావుకు అందించారు. కాగా, అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే భక్తుడు స్వామివారికి రూ. 15 లక్షల విలువైన కారును సమర్పించుకున్నారు.