: అమెరికా బాస్కెట్ బాల్ పోటీలు వీక్షించిన ఉత్తర కొరియా అధ్యక్షుడి డూప్!


ఒలింపిక్స్ లో అమెరికన్ జట్టు ఆడిన బాస్కెట్ బాల్ పోటీలను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ లాంటి వ్యక్తి వీక్షించారు. రియో ఒలింపిక్స్ లో ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీవీ చానెల్స్ ఒక వ్యక్తిని క్లోజప్ లో చూపించాయి. ఆ వ్యక్తిని చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దానికి కారణం, ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను పోలి ఉండడమే. అమెరికాను తీవ్రంగా ద్వేషించే కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశం పాల్గొనే పోటీలను ఎలా వీక్షించారనే అనుమానం వారందరికీ వచ్చింది. ఆయన కిమ్ జాంగ్ ఉన్ అని అంతా భావిస్తున్న తరుణంలో ఆయన కిమ్ జాంగ్ ఉన్ కాదని, అచ్చం ఆయనలాంటి వ్యక్తని అందరికీ తెలిసింది! కిమ్ జాంగ్ ఉన్ పోలికలతో ఉన్న హోవార్డ్ అనే ఈ వ్యక్తి గత కొన్నేళ్లుగా అతనిని అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. తన వ్యక్తిగత వివరాలేవీ బయటపెట్టకుండా, కిమ్ జాంగ్ ఉన్ పై ఆరోపణలు లేదా విమర్శలు చేస్తూ, ఆయనను పోలిన హావభావాలతో హోవార్డ్ ఆకట్టుకుంటున్నారు. అచ్చం కిమ్ జాంగ్ ఉన్ వేసుకునేలాంటి దుస్తులు ధరించి, అచ్చం ఆయనలాంటి హావభావాలు ప్రదర్శించడంలో హోవార్డ్ దిట్ట.

  • Loading...

More Telugu News