: సింధుకు ఏపీ నజరానా.. రూ.3 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం, అమరావతిలో వెయ్యి గజాల ఇంటి స్థలం
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించి భారత్ కు రజత పతకాన్ని తీసుకొచ్చిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.3 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం, అమరావతిలో వెయ్యి గజాల ఇంటి స్థలం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఆమె కోచ్ గోపీచంద్‌కు కూడా రూ.50 లక్షల నగదును అందించనుంది.