: తెలుగు రాష్ట్రాల్లో పుష్కర ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేసిన గవర్నర్
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల పుష్కర ఘాట్‌లో ఈరోజు పుణ్యస్నానమాచరించిన అనంతరం అలంపూర్‌లోని జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ దర్శనం అనంతరం నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో చేసిన పుష్కర ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని అన్నారు. పుష్కరఘాట్లలో ఏర్పాట్లు చాలా బాగున్నాయని గవర్నర్ కితాబిచ్చారు. అలంపూర్ జోగులాంబ ఆలయం చాలా విశిష్టమైందని పేర్కొన్న ఆయన.. ఆలయ అభివృద్ధి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అలంపూర్ నుంచి కొద్ది సేపటి క్రితం ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు.