: తక్కువ నిద్రతో సంతాన సాఫల్యత తగ్గుతుందట!


తక్కువ నిద్ర పోవడం అనేది నవతరం జీవన విధానంలో ఒక భాగంగా మారిపోతోంది. బయటి పనుల ఒత్తిడిలో ఏ అర్ధరాత్రి వేళకో ఇల్లు చేరుకోవడం మళ్లీ తెల్లవారకముందే ఉరుకులు పరుగుల మీద జీవన సమరాన్ని ప్రారంభించడం.. నేటి తరం జీవుల్లో రివాజు అయిపోతోంది. అయితే పురుషుల్లో నిద్రలేమి ఉండడం అనేది వారి సంతాన సాఫల్యతపై కూడా ప్రభావం చూపిస్తుందట. తగినంత నిద్ర లేకపోతే.. వీర్యకణాల సంఖ్య భారీగా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

రోజూ చాలినంత నిద్రలేకపోయినా.. కలతనిద్రపోతున్నా.. వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని, నాణ్యత కూడా తగ్గుతుందని వీరి అధ్యయనం తేల్చింది. ఇరవయ్యేళ్ల ప్రాయంలో ఉన్న కుర్రకారుపై జరిపిన అధ్యయనంతో ఈ విషయం నిగ్గుతేల్చారు. మై హెల్త్‌ న్యూస్‌ డైలీ ప్రచురించిన వివరాల ప్రకారం.. నాలుగు వారాల పాటూ ఈ కుర్రాళ్లు నిద్రపోయిన సమయం నమోదుచేసి, ఆ రోజుల్లో వారి రక్తంలోని టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లెవల్స్‌, వీర్యం లను పరీక్షించారు. నిద్ర తక్కువ ఉన్న వారిలో 25 శాతం వరకు వీర్యకణాలు తగ్గినట్లు గుర్తించారు.

  • Loading...

More Telugu News