: మిర్యాలగూడలో సిట్!... నయీమ్ సోదరి, బావమరిదిలను విచారిస్తున్న ఖాకీలు!


గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత... అతడి వ్యవహారాలన్నింటి గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తెలుగు రాష్ట్రాలను జల్లెడ పడుతోంది. వారం క్రితం విశాఖ వెళ్లిన సిట్ అధికారులు అక్కడ గుట్టు చప్పుడు కాకుండా నయీమ్ సాగించిన వ్యవహారాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. తాజాగా నేటి ఉదయం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడకు చేరుకున్న సిట్ అధికారులు నయీమ్ అక్క సుల్తానా బేగం, బావమరిది సాజిద్ లను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను కొనుగోలు చేసినట్లు వెల్లువెత్తిన ఆరోపణలకు సంబంధించి వారిద్దరినీ విచారిస్తున్న పోలీసులు వారికి సహకరించారని భావిస్తున్న ఇద్దరు ఆర్ఎంపీ వైద్యులను కూడా విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News