: హైదరాబాదులో కర్ణాటక మాజీ సీఎం!... కాసేపట్లో పవన్ కల్యాణ్ తో భేటీ!


భాగ్యనగరి హైదరాబాదులో మరికాసేపట్లో కీలక భేటీ జరగనుంది. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో అడుగుపెట్టారు. శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన ఆయన నేరుగా జూబ్లీహిల్స్ కు బయలుదేరారు. టాలీవుడ్ అగ్రహీరో, జన సేన అదినేత పవన్ కల్యాణ్ తో భేటీ కోసమే ఆయన హైదరాబాదు వచ్చినట్లు సమాచారం. వీరి మధ్య భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయా? లేదా సినిమాకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతుందా? అన్నదానిపై స్పష్టత లేదు.

  • Loading...

More Telugu News