: బీహార్ లో ఆర్జేడి నేత దారుణ హత్య!... పిస్టల్ తో కాల్చేసిన దుండగులు!


బీహార్ లో గూండారాజ్ కొనసాగుతోంది. నిన్నటిదాకా పలు కారణాలతో అధికారులు, కాంట్రాక్టు కంపెనీల ఉద్యోగులు బలైపోగా... తాజాగా ఆ రౌడీయిజానికి రాజకీయ నేతలు హతమైపోతున్నారు. నేటి ఉదయం ఆ రాష్ట్రంలోని భాగల్పూర్ లో అధికార కూటమిలోని ఆర్జేడీ నేత వినోద్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు అత్యంత సమీపం నుంచి వినోద్ యాదవ్ పై పిస్టల్ తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వినోద్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News