: సైనా! ప్యాక్ యువర్ బ్యాగ్స్ : నెటిజన్ విపరీత వ్యాఖ్యలు


రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పీవీ సింధు సిల్వర్ మెడల్ సాధించడంతో యావత్తు దేశం సంబరాల్లో ఉన్న తరుణంలో ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ పై ఒక నెటిజన్ విపరీత వ్యాఖ్యలు చేశాడు. ‘డియర్ సైనా..ప్యాక్ యువర్ బ్యాగ్స్.. మంచి క్రీడాకారులను ఓడించే సత్తా ఉన్న క్రీడాకారిణిని మన దేశానికి లభించింది’ అంటూ ఆ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు ఏమాత్రం కలత చెందని సైనా తనదైన శైలిలో చాలా హుందాగా సమాధానమిచ్చింది. ‘ష్యూర్, థ్యాంక్యు. సింథు చాలా బాగా ఆడింది...’ అని సైనా పేర్కొంది. ఈ సమాధానానికి తన తప్పేమిటో గ్రహించిన ఆ నెటిజన్ ‘సైనా, నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు... నిన్ను బాధ పెట్టాలని ఆ ట్వీట్ చేయలేదు. మీరంటే నాకెంతో అభిమానం... ఇప్పటికీ నేను మీ అభిమానినే’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ‘నో ప్రాబ్లమ్ మై ఫ్రెండ్.. ఆల్ ది బెస్ట్ టూ యూ’ అని సైనా సదరు నెటిజన్ కు మరో ట్వీట్ చేసింది. కాగా, మోకాలికి గాయం కారణంగా రియో ఒలింపిక్స్ నుంచి సైనా వైదొలగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో సైనా చికిత్స పొందుతోంది.

  • Loading...

More Telugu News