: బంగారు పతకం నాన్న కల...సింధు నిజం చేస్తుంది: సింధు అక్క దివ్య


తన చిట్టి చెల్లెలు పీవీ సింధు బంగారు పతకం తీసుకొస్తుందని ఆమె అక్క పీవీ దివ్య తెలిపారు. నెల్లూరులో ఉంటున్న సింధు సోదరి దివ్య మాట్లాడుతూ, సింధు ఒలింపిక్స్ లో పతకం సాధించడం తన తండ్రి కల అని అన్నారు. ఈ కలను ఇప్పటికే నెరవేర్చిన సింధు...స్వర్ణ పతకం తేవడం ద్వారా తన తండ్రికి మర్చిపోలేని బహుమతి ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సింధుకు, తనకు మధ్య వయసు వ్యత్యాసం బాగా ఉందని చెప్పారు. సింధు పెద్దదైన తరువాత ఆమె గురించి ఎప్పుడడిగినా ప్రాక్టీస్ కు వెళ్లిందని సమాధానం వచ్చేదని, దీంతో తను ఎప్పుడు తనతో గడిపితే అప్పుడు సంతోషంగా ఉండడం అలవాటు చేసుకున్నానని ఆమె చెప్పారు. సింధు ప్రాక్టీస్, టోర్నమెంట్లు ఇలా బిజీగా ఉండేదని, తనతో స్నేహం కంటే అమ్మా, నాన్నతోనే సింధుకి బాగా అనుబంధమని ఆమె తెలిపారు. చెల్లి బంగారుపతకం తెస్తుందన్న విశ్వాసముందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News