: సింధు, నీ కోసమే ఎదురుచూస్తున్నాను: అభినవ్ బింద్రా


రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ఫైనల్ కు చేరుకున్న పీవీ సింధు విజయం సాధించాలని యావత్తు దేశం కోరుకుంటోంది. అదేవిధంగా భారత షూటర్ అభినవ్ బింద్రా కూడా సింధు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో బింద్రా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో ఏ క్రీడాకారుడు కూడా ఒలింపిక్స్ లో స్వర్ణం చేజిక్కించుకోలేదు. ‘రియో’లో ఫైనల్ కు చేరిన పీవీ సింధు స్వర్ణం సాధించి తన సరసన చేరాలని, అందుకోసం తాను వెయిట్ చేస్తున్నానంటూ ఆ ట్వీట్ లో బింద్రా పేర్కొన్నాడు. కాగా, ఈరోజు రాత్రి 7.30 గంటలకు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ క్రీడాకారిణితో సింధు తలపడనుంది.

  • Loading...

More Telugu News