: బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడు కిరాతకుడు...50 దారుణాలకు పాల్పడ్డాడు
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో కార్లో వెళ్తున్న కుటుంబాన్ని అటకాయించి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ముఠాలోని ప్రధాన నిందితుడంతటి కిరాతకుడ్ని చూడడం కష్టమని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సలీం బావరియాపై ఐదు రాష్ట్రాల్లో కేసులున్నాయి. 50 కుటుంబాలపై దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. మరెంతో మందిపై బందిపోటు తరహా దోపీడీలకు పాల్పడ్డాడు. రాజస్థాన్ లో గత జూన్ 30న ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వాళ్లింట్లోని ఓ అమ్మాయిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి, చిత్ర హింసలు పెట్టడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. గత జూలైలో జాతీయ రహదారి-91పై నాలుగు దోపిడీలు చేశాడని వారు వెల్లడించారు. అదే నెలాఖరులో బులంద్ షహర్ జాతీయ రహదారిపై ఓ ఫ్యామిలీని అటకాయించి అందులోని తల్లీ కూతుళ్లపై సామూహిక లైంగికదాడికి పాల్పడడంతో వీరి పాపం పండిన సంగతి తెలిసిందే.