: చిత్తూరు జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు!... మదనపల్లిలో వ్యక్తిని వేట కొడవళ్లతో నరికేసిన ప్రత్యర్థులు!
ఏపీలోని చిత్తూరు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని మదనపల్లిలో పట్ట పగలు వేట కొడవళ్లు స్వైర విహారం చేశాయి. పట్టణంలోని దేవళం వీధికి చెందిన కాళేశ అనే వ్యక్తిపై ఆయన ప్రత్యర్థులు మెరుపు దాడికి దిగి, వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికారు. పట్టణంలోని రాజీవ్ నగర్ లో చోటుచేసుకున్న ఈ దాడిలో కాళేశ అక్కడికక్కడే చనిపోయాడు. పాత కక్షల కారణంగా కాళేశపై అతడి ప్రత్యర్థులు దాడికి దిగారని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్ట పగలు పట్టణంలో చోటుచేసుకున్న ఈ హత్య మదనపల్లిలో కలకలం రేపింది.