: ఏపీకి ఏడుకొండలవాడి దయ కావాలి: సినీ నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడుకొండలవాడి దయ కావాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ అన్నారు. ఈరోజు ఆయన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల, తిరుపతి అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో కంటే భిన్నంగా తిరుపతి ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తిరుమలలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయని ప్రశంసించారు. టీటీడీకి ఇలాంటి ఛైర్మన్లు ఉండాలని కితాబిచ్చారు. రాష్ట్రాన్ని ఆపదమొక్కుల వాడు చల్లగా చూడాలన్నారు.