: ఒలింపిక్స్‌లో వంద పతకాలు సాధించి నెం.1 గా కొనసాగుతున్న అమెరికా.. 71వ స్థానంలో భార‌త్


బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో కొన‌సాగుతున్న‌ ఒలింపిక్స్‌లో అమెరికా పతకాల పంట పండిస్తోంది. ఇప్ప‌టికే పతకాల సెంచరీని కొట్టింది. మరిన్ని పతకాలు సాధించే దిశగా వెళుతూ నెంబ‌ర్ 1 స్థానంలో నిలిచింది. అమెరికా సాధించిన ప‌త‌కాల్లో 35 స్వ‌ర్ణాలు, 33 ర‌జ‌తాలు, 32 కాంస్యాలు ఉన్నాయి. కాగా, 56 ప‌త‌కాల‌తో రెండో స్థానంలో గ్రేట్ బ్రిట‌న్ కొన‌సాగుతోంది. చైనా, జ‌ర్మ‌నీ, ర‌ష్యా ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్ప‌టికి ఒక కాంస్య ప‌త‌కం సాధించిన‌ భార‌త్ 71 వ స్థానంలో కొన‌సాగుతోంది. మరోరెండు రోజుల్లో ఒలింపిక్స్ పండుగ‌ ముగియ‌నుంది.

  • Loading...

More Telugu News