: సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కేసిన జేడీ.. హీరోయిన్ అనుకృతి మెడలో మూడుముళ్లు


పెళ్లి చేసుకునే పరిణతి తనకింకా రాలేదని గత కొన్నేళ్లుగా చెబుతూ వచ్చిన టాలీవుడ్ హీరో, డైరెక్టర్ జేడీ చక్రవర్తి సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కేశాడు. కథానాయిక అనుకృతి గోవింద శర్మను ఆయన వివాహమాడాడు. ఈ పెళ్లికి అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో జేడీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అనుకృతి గతంలో ‘పాపా’ డైరెక్టర్ యోగిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అసభ్యకరమైన సీన్లలో తనను నటించమంటున్నాడంటూ అతడిపై కేసు కూడా పెట్టింది. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకానీ, అందుకు కావాల్సిన పరిణతి కానీ తనలో లేవని పలుమార్లు చెప్పిన జేడీ(46)ని ఆమె తల్లి శాంత ఒప్పించడంతో ఈ పెళ్లికి జేడీ అంగీకరించినట్టు తెలిసింది. 1989లో సంచలన చిత్రం 'శివ'తో పరిచయమైన జేడీ, ఆ తర్వాత 1998లో 'సత్య' సినిమాతో బాలీవుడ్‌లో హీరోగా రంగప్రవేశం చేశాడు.

  • Loading...

More Telugu News