: నిరుద్యోగులకు తీపి కబురు.. రాష్ట్ర విభజన తర్వాత తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురునందించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీపీఎస్సీ తొలి నోటిఫికేషన్ ను ఈరోజు విడుదల చేసింది. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ సహా వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల వయో పరిమితిని కూడా 40 ఏళ్లకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్‌భాస్కర్ మీడియాకు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 740 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.