: మళ్లీ అదే తీరు.. జోనల్ వ్యవస్థపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు
జోనల్ వ్యవస్థపై తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు ఒకే మాటపై నిలబడకుండా పాడిన పాటే పాడుతున్నాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు నిర్వహించిన భేటీలో జోనల్ విధానం కొనసాగించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరితే, ఎత్తివేయాలని మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేసి, జిల్లా, రాష్ట్రస్థాయి క్యాడర్‌లు కొనసాగించాలని పీఆర్‌టీయూ, టీఆర్‌టీయూ కోరాయి. అలాగే పదవీ విరమణను 60 ఏళ్లకు పెంచాలని విన్నవించుకున్నాయి. అయితే ఆ వ్యవస్థను రద్దు చేయొద్దని యూటీఎఫ్, ఎస్‌టీయూ, టీటీ జేఏసీ విన్నవించుకున్నాయి