: బిడ్డ మారాం చేస్తే గుర్రం అవతారమెత్తిన క్రికెటర్!
కన్నబిడ్డలపై ప్రేమ తండ్రిని ఎన్నో అవతారాలెత్తేలా చేస్తుంది. ఆ తండ్రి సాధారణ వ్యక్తి అయినా, లేక, సెలబ్రిటీ అయినా తమ పిల్లో పిల్లాడో ఏదైనా కావాలంటూ అడిగిన వేళ, అలిగిన వేళ వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయకుండా ఉండరు. ఈ క్రమంలో ముఖ్యంగా గుర్తుకు వచ్చే ఆట ‘ఛల్ ఛల్ గుర్రం.. చలాకీ గుర్రం’. క్రికెటర్ యూసఫ్ పఠాన్ కూడా తన మూడేళ్ల కొడుకు అయాన్ తో ఇప్పుడు అదే ఆట ఆడిస్తున్నాడు. అయాన్ కు గుర్రపు స్వారీ గుర్తొచ్చి, గుర్రమెక్కాలని మారం చేయడంతో యూసఫే గుర్రం అవతారమెత్తాడు. ఈ విషయాన్ని యూసఫ్ తన సామాజిక మాధ్యమం ఖాతా ద్వారా తెలిపాడు. కాగా, గత జాన్ లో అయాన్ కి గుర్రపు స్వారీని యూసఫ్ పఠాన్ పరిచయం చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోల్పోయిన యూసఫ్ ఇటీవల జరిగిన ఐపీఎల్-9లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.