: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు


వరుసగా రెండు రోజుల పాటు నష్టాల‌ను చవిచూసిన భార‌తీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టి లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్‌ 118 పాయింట్లు లాభపడి 28123 పాయింట్ల వద్ద ముగిస్తే, నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 8673 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే రూ.66.81గా ఉంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఎన్‌ఎస్‌ఈలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల‌ను అర్జించ‌గా, టాటా పవర్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా, ఎల్‌ అండ్ టి కంపెనీల షేర్లు న‌ష్టాల‌ను చ‌విచూశాయి.

  • Loading...

More Telugu News