: డీఎంకే నేత స్టాలిన్‌ను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్న మార్షల్స్.. సభలోకి వెళ్లే మార్గాన్ని లాక్ చేసిన సిబ్బంది
తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై తీవ్ర విమర్శలు చేస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీలో ఆందోళన చేబట్టడం, దీంతో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ సదరు పార్టీకి చెందిన 89 మంది ఎమ్మెల్యేలను ఏడు రోజుల పాటు సస్పెండ్ చేయడం విదితమే. అయితే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తమ ఆందోళనను ఈరోజు అసెంబ్లీ బయట కొనసాగించారు. అసెంబ్లీ ఆవరణలోకి రావాలని చూసిన వారిని సిబ్బంది అడ్డుకున్నారు. ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ను అసెంబ్లీ మార్షల్స్ లోపలికి రానివ్వలేదు. సభకు వెళ్లే వైపు మార్గాన్ని కూడా లాక్ చేసేశారు. దీంతో డీఎంకే నేతలు అసెంబ్లీ బయటే ఆందోళన తెలిపారు. ప్రతిపక్ష నేతల ఆందోళనతో అక్కడి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.