: నయీమ్ కేసు: నలుగురు అనుచరులను నార్సింగ్‌లో విచారిస్తున్న అధికారులు
ఇటీవల తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణ కోసం నయీమ్ సన్నిహిత అనుచరులు నలుగురుని ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఈరోజు వారిని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు ఫయీమ్, అతని భార్య షాహీన్‌తో పాటు ఫర్జానా, ఆఫ్సానాల నుంచి కేసులో పలు అంశాలను రాబడుతున్నారు. వీరిని విచారిస్తోన్న వారిలో నల్గొండ జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, క్లూస్ టీమ్ అధికారులు కూడా ఉన్నారు.