: ‘హాక్ ఐ మొబైల్ యాప్’ను ప్రారంభించిన సైబరాబాద్ సీపీలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్ జోన్‌లుగా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ పోలీస్ కమీషనర్‌లుగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే నవీన్ చంద్, మహేశ్ భగవత్ మహిళల భద్రత కోసం ఉపయోగపడే ‘హాక్ ఐ యాప్’ ను ప్రారంభించారు. కొద్ది సేపటి క్రితం ఇరువురు కమీషనర్లు కలిసి సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదంతో ఉన్న ఈ యాప్‌ను ఆవిష్కరించి, యాప్ పనిచేసే తీరును వివరించారు. సైబరాబాద్‌లోని రెండు జోన్ల పరిధిలో ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజల రక్షణే తమ కర్తవ్యమని పేర్కొన్నారు.