: తండ్రికి, తాతకు పిండ ప్రదానం చేసిన వైఎస్ జగన్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని పున్నమి పుష్కర ఘాట్ లో బిజీబిజీగా గడిపారు. కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం చేసేందుకు నేటి ఉదయం విజయవాడకు వచ్చిన వైఎస్ జగన్... తొలుత నగరంలోని లబ్బీపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత నేరుగా పున్నమి ఘాట్ కు వచ్చిన ఆయన పుష్కర స్నానం చేశారు. ఆ తర్వాత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత వైఎస్ రాజారెడ్డిలకు ఆయన పిండ ప్రదానం చేశారు. పుష్కర ఘాట్ కు వచ్చిన జగన్ ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపారు.