: యూ ట్యూబ్ లో క్రైస్తవ సన్యాసిని వీడియో సంచలనం... ఒక్కరోజులోనే 12 లక్షల మంది వీక్షణ


86 ఏళ్ల క్రైస్తవ సన్యాసిని యూట్యూబ్ లో సంచలనంగా మారింది. అమెరికాకు చెందిన సిస్టర్ మడోనా బుడర్ కు చిన్ననాటి నుంచి అథ్లెటిక్స్ అంటే ఎంతో ఇష్టం. క్రైస్తవ సన్యాసినిగా మారినప్పటికీ ఆమె అథ్లెటిక్స్ ను మర్చిపోలేదు. కుదిరినప్పుడల్లా ప్రాక్టీస్ చేశారు. అలా ప్రాక్టీస్ చేస్తూ, ఇప్పటి వరకు 40 సార్లకు పైగా అత్యంత కఠినమైన 'ఐరన్ మ్యాన్' రేసులో పాల్గొన్నారు. దీంతో ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. వారంతా ఆమెను 'ఐరన్ నన్' అని ప్రేమగా పిలుచుకుంటారు. ఐరన్ మ్యాన్ రేసులో భాగంగా 180 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణించాలి. ఆ తరువాత 42 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఆ తరువాత 3.8 కిలోమీటర్ల దూరం ఈత కొట్టాలి. ఇవన్నీ ఎవరు తొందరగా అధిగమిస్తే వారు ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటారు. ఇంత కఠినమైన పోటీల్లో ఆమె 40 సార్లకు పైగా పాల్గొన్నారు. దీంతో 86 ఏళ్ల లేటు వయసులో కూడా ఆమె పాల్గొనడంపై ప్రముఖ స్పోర్ట్స్ వేర్ సంస్థ నైక్ 'అన్ లిమిటెడ్ యూత్' పేరుతో ఒక ప్రకటన రూపొందించింది. ఈ వీడియోను ఆగస్టు 14న విడుదల చేయగా, కేవలం ఒక్క రోజులో 12 లక్షల మంది దీనిని వీక్షించడం విశేషం.

  • Loading...

More Telugu News