: హోరా హోరీ పోరులో లిన్ డాన్ చేతిలో శ్రీకాంత్ ఓటమి
రియో ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్స్ లో జరిగిన హోరా హోరీ పోరులో లిన్ డాన్ చేతిలో శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. తొలి సెట్ ను గెలుచుకుని లిన్ డాన్ ముందంజ వేయగా, రెండో సెట్ ను గెలుచుకున్న శ్రీకాంత్ లిన్ డాన్ కు సవాలు విసిరాడు. మూడో సెట్ లో లిన్ డాన్, శ్రీకాంత్ మధ్య మ్యాచ్ ఉత్కంఠగా, ప్రతి పాయింట్ హోరాహోరీగా జరిగింది. 8 పాయింట్లు, 11 పాయింట్ల వద్ద లభించిన ఆధిక్యాన్ని నిలుపుకోవడం విఫలం కావడంతో శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. దీంతో క్వార్టర్ ఫైనల్ లో లిన్ డాన్ చేతిలో శ్రీకాంత్ 6-21, 21-11, 21-18తో ఓటమిపాలయ్యాడు. దీంతో రియోలో ఇండియా పెట్టుకున్న రెండో పతకం ఆశలు ఆవిరయ్యాయి.