: న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్‌మార్కెట్లు


నిన్న నష్టాల‌ను చ‌విచూసిన‌ స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా అవే ఫ‌లితాలు వ‌చ్చాయి. సెన్సెక్స్‌ 59 పాయింట్లు కోల్పోయి 28,005 వద్ద ముగిస్తే; నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 8,624 వద్ద ముగిసింది. ఇక‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.66.76గా ఉంది. బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, హీరో మోటార్‌ కార్పొరేషన్‌, టాటాస్టీల్‌, కోల్‌ఇండియా, అరబిందోఫార్మా షేర్లు దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ లో లాభాలు అర్జించాయి. టెక్‌మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల‌ను చ‌విచూశాయి.

  • Loading...

More Telugu News